
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 15 :-రిపోర్టర్ (కే శివకృష్ణ )
బాపట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బాపట్ల పట్టణం లోని అర్హులైన 6 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన CMRF చెక్కులను లబ్ధిదారులకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అందజేశారు. వివరాలు:- బాపట్ల పట్టణం దగ్గుమల్లివారి పాలెంకి చెందిన దాసరి మురళి కి రూ.1,01,707/- బాపట్ల పట్టణం రైలు పేటకి చెందిన షేక్ మస్తాన్ వలి కి రూ. 74,398/-బాపట్ల పట్టణం ఇమ్మడిశెట్టి వారి పాలెం కి చెందిన ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ కి రూ. 56,365/- బాపట్ల పట్టణం చిల్లర గొల్లపాలెంకి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు కి రూ.45,000/- బాపట్ల పట్టణానికి చెందిన అన్నవరం మాధవరావు కి రూ.42,000/- బాపట్ల పట్టణానికి చెందిన జి హరి ప్రకాష్ కి రూ.18,000/-
మొత్తం కలిపి రూ.3,37,470/- చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అని అన్నారు.అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు,బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు మందపాటి ఆంధ్రేయ మరియు తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.