
పయనించే సూర్యుడు మార్చి 14 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి తులిశ్య నాయక్ తండా బొమ్మనపల్లి గ్రామంలో హోళీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హాథిరామ్ నాయక్ తండా ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు లంబాడి బంజారాలు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ హోలీ పండుగ అని దేశ వ్యాప్తంగా ఉన్న బంజారాలు గత వారం పది రోజులు గా సాయంత్రం పూట తండా నాయకుని ఇంటి దగ్గర చిన్నలు పెద్దలు మహిళలూ కోలాటం ఆడుతూ ఆట పాటలతో డప్పు నృత్యాలు చేస్తూ ఎంతో కోలాహలంగా జరుపుకుంటారు హోళీ రోజూ ఉదయం 4.00 గంటలకు హోళీ మంటలు వెలిగించి తరువాత రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తారు యాటలు కోసి తండాv నాయకులు పంచుకుంటారు ఆనందంతో పండుగను జరుపుకుంటారు ఈ కార్యక్రమం లో నాయకులు జుంకిలాల్ నాయక్ రత్నా నాయక్ శంకర్ నాయక్ వస్య నాయక్ ఉద్యోగులు ఉపాధ్యాయులు నాయకులు రమేష్ బాబు రవి కుమార్ ప్రభాకర్ లక్ష్మణ్ యువకులు నిఖిల్ పవార్ సురేష్ ప్రకాష్ సందీప్ సంతూ మహిళలూ తదితరులు పాల్గొన్నారు