
ఏ కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండాలో హోలీ పండుగ ఉత్సవంలో పాల్గొన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దంపతులు. పయనించే సూర్యుడు మార్చ్ 16 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ఎమ్మెల్యే దంపతులకు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికిన హిళలు, చిన్నారులు. హోలీ పండుగ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న 35 తండాలకు ఒక్కొక్క తండాకు 10 వేల రూపాయలు ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. మహిళలు చిన్నారులతో కలిసి సంప్రదాయ పాటలకు నృత్యం చేసిన ఎమ్మెల్యే దంపతులు. ఎమ్మెల్యే దంపతులకు సంప్రదాయ నూతన వస్త్రాలు బహుకరించిన పెద్ద తండా వాసులు. ఈ కార్యక్రమంలో ఏ కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి,రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, గోప్రాజు నాయక్,భీమ్లా నాయక్,పీక్ల నాయక్ మరియు తండా ప్రజలు పాల్గొన్నారు.