
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్.
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 18// //మక్తల్ రిపోర్టర్.సి తిమ్మప్ప //
మక్తల్ పట్టణ కేంద్రలోని మహాత్మ బాపూలే కాలనీ(B.C కాలనీ)లో సంచార తెగకు చెందిన బుడగజంగాలు మరియు డక్కలి సామాజిక వర్గానికి చెందిన పిల్లలు దాదాపు 60 మంది దాకా ఉన్నారని,ఈ పిల్లలు పుట్టుకతోనే తీవ్రమైన పౌష్టికాహార లోపంతో అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారని,వీరికోసం అక్కడ నూతన అంగన్వాడి సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ బెన్ శాలం గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.అదేవిధంగా వారితో మాట్లాడుతూ వీరి తల్లిదండ్రులకు ఉన్న నిరాక్షరాస్యత,సామాజిక వెనుకబాటుతనం వీరి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ…ఇప్పటికీ కూడా ఈ కాలనీకి కనీసం ఒక కిలోమీటర్ పరిధిలో కూడా అంగన్వాడి సెంటర్ లేకపోవడం విచారకరం.కావున వెంటనే మహత్మ బాపులే (B.C కాలని) కాలనిలోని పేద పిల్లలకు అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పౌష్టిక ఆహారాన్ని,పూర్వ ప్రాథమిక విద్యను అందించి,అందరితో పాటు చదువు, ఆరోగ్యంగా బ్రతికే హక్కును ప్రభుత్వాలు వారికి కల్పించాలని కోరడం జరిగింది. దీనికి అదనపు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు మీ యొక్క వినతి పత్రాన్ని ఫార్వర్డ్ చేయిస్తానని,అంతేకాకుండా నూతన అంగన్వాడి సెంటర్ ఏర్పాటుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్ , క్రియాశీలక సభ్యులు శ్రీహరి,తేజ, రమేష్,రవి కుమార్,శ్రీనివాస్,క్రాంతికుమార్,రాజు తదితరులు పాల్గొన్నారు.
