
పయనించే సూర్యుడు గాంధారి 19/03/25
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతంగల్ కలాన్ పాఠశాలకు 20,000 రూపాయల విలువచేసే ప్రింటర్ను బహూకరించిన వేల్పుల గీత..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతంగల్ లో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తూ స్పౌజ్ బదిలీలలో భాగంగా నిజాంబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన సందర్భంలో గీతా నేడు పాఠశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది.. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గన్నమనేని రంగారావు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్సులో ప్రయోగాల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో అద్భుతమైన బోధనను అందించడంతోపాటు పాఠశాల అభివృద్ధికి సహకరించిన గీత బదిలీపై వెళ్లడం పాఠశాలకు లోటుగా ఉందని, కానీ వారి సొంత జిల్లాకు వెళ్లినందుకు ఆనందపడుతున్నామని, బదిలీపై వెళ్తున్న సందర్భంలో కూడా పాఠశాలకు ప్రింటర్ లేదని ప్రింటర్ బహకరించిన వారి మంచి గుణానికి అభినందనలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ వడ్ల బాలరాజ్, విట్టల్ రెడ్డి, VDC చైర్మన్ మహిపాల్ రెడ్డి సన్మానించి అభినందనలు తెలియజేశారు… అనంతరం బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు…