
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఉద్యమాలు, నిరసనలు నిషేధమా?
ప్రజా పాలనలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఆనాటి ఉద్యమ కేంద్రం ఉస్మానియా
యూనివర్సిటీలో నేడు నిషేధాలు పెట్టడం సరికాదు.
అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్)
(ఏఐఎస్ఎఫ్) రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు మార్చి 19 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలో ఎలాంటి నిరసనలు ధర్నాలు నిర్వహించరాదని ఉపకులపతి రిజిస్టర్ విడుదల చేసిన సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలిని అఖిల భారత విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తుంది. ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఎన్నో పోరాటాలు త్యాగాలకు చిహ్నమని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో ఎంతోమంది వీరులను సమాజానికి పరిచయం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ నేల అని పేర్కొన్నారు. అటువంటి నేలపై నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా నిరాసనాలు ధర్నాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేయడం వారి నియంత పోకడకు నిదర్శమని విమర్శించారు. విద్యార్థి ఉద్యమాలకు ఆనచాలని చూస్తే విద్యార్థుల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తుంది అని ఆకాష్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరించారు.