
ఉపాధి కార్యాలయాన్ని తనిఖీ చేసిన చేజర్ల ఎంపీపీ తూమాటి
పయనించే సూర్యుడు మార్చి 19 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయ సిబ్బంది రేపటి రోజుకు కూడా ముందు రోజు హాజరు పట్టికలో సంతకాలు పెట్టేసి రేపటి రోజు డ్యూటీకి వస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉపాధి సిబ్బంది ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా సిబ్బంది అనుమతి లేకుండా గైర్హాజరై వారి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చేజర్ల మండల పరిషత్ కార్యాలయాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తూమాటి విజయభాస్కర్ రెడ్డి సందర్శించి అక్కడి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.ఈ పరిశీలనలోమండలాధ్యక్షులు హాజరు పట్టికను చూసి నివ్వెర పోయారు. సదరు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు రఘురామయ్య జానీ భాష ఇద్దరూ 19వ తారీకు బుధవారానికి కూడా ముందే సంతకాలు చేసుకున్నారు ఈయనకు తోడు తనిఖీ సమయములో కూడా విధులకు డుమ్మా కొట్టారు. ఇదేమని ప్రశ్నించేందుకు అక్కడి సిబ్బంది కూడా ఎవ్వరూ లేకపోవడంతో విషయం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మండల అధ్యక్షులు తెలిపారు. ఇలా విధులకు హాజరు కాకుండానే వచ్చిన రోజు సంతకాలు చేసి తర్వాత రోజులు కూడా సంతకాలు చేసి వెళ్లడం ఉపాధి సిబ్బందికి పరిపాటిగా మారిందని పలువురు ఉపాధి హామీ కూలీలు తెలుపుతున్నారు వాళ్లు సమస్యలపై కూలీలు, మెట్లు కార్యాలయానికి వెళితే సమాధానం చెప్పే పరిస్థితి ఎవరు కనపడటం లేదని కూలీలు వాపోతున్నారు.
హాజరు రిజిస్టర్ లో తర్వాతి రోజు కూడా సంతకాలు చేసి ఉండడాన్ని బట్టి చూస్తే అంతా మా ఇష్టం మమ్మల్ని అడిగేవారు ఎవరు అన్నట్టుగా ఉపాధి హామీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉన్నతాధికారులు పై విషయం పై విచారణ జరిపి బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు తెలిపారు