
పయనించే సూర్యుడు న్యూస్( మార్చి.19/03/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత రెండు సంవత్సరాలుగా స్పోర్ట్స్ ఫర్ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్ ద్వారా మ్యాజిక్ బస్సు సంస్థ మోండలేజ్ కంపెనీ సహకారంతో కబడ్డీ వాలీబాల్ నందు శిక్షణ ఇప్పిస్తూ రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి లోనూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వెంకటాచలంలోని అలెక్స కాలేజీ నందు ప్రత్యేక శిక్షణ ఇప్పించి అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను హిమాచల్ ప్రదేశ్ లో21,22 తేదీలలో జరగబోతున్న కబడ్డీ టోర్లమెంట్ కు 34 మంది విద్యార్థిని విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఇందులో తడ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఎం వసంత్ కుమార్, వి శివనేస్ మరియు సిహెచ్ మస్తాన్ రాష్ట్రస్థాయిలో ఎస్ జి ఎఫ్ సెలెక్ట్ అయి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో జరగబోతున్న మ్యాజిక్ బస్సు సంస్థ నిర్వహిస్తున్న టోర్నమెంట్ కు ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉంది పేద విద్యార్థులకు ఆటలపై ఆసక్తి కల్పించడం కోసం కోసం ఎంతో ఖర్చు చేస్తూ పిల్లలు బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు పూర్తి బాధ్యత A/C బర్త్ ట్రావెల్ ఖర్చులు ,ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళడం మ్యాజిక్ బస్సు సంస్థ చేస్తున్న కృషికి సంస్థ ప్రతినిధులు డిపిఎం కె ఆనంద్ క్లస్టర్ మేనేజర్ పి ఆనంద్ కోఆర్డినేటర్ సుమంత్ మరియు కోచ్ మురళీకృష్ణ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హేచ్ సురేష్ , వ్యాయామ ఉపాధ్యాయులు పి మంజుల, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు