
పయనించే సూర్యడు // మార్చ్ // 19// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
వీణవంక మండల కేంద్రానికి చెందిన వొరేం శ్రీనివాస్ తండ్రి పద్మయ్య వారు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసి పార్టీ మనుగడ కోసం పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశానుసారం, వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో వీణవంకలో గ్రామ శాఖ అధ్యక్షునిగా వొరేం శ్రీనివాసుని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వొరేం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన నియమకానికి కృషిచేసిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు ఒడితల ప్రణవ్ బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ కొరకు వాహర్నిశలు కష్టపడుతూ రానున్న రోజుల్లో స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడతానని తెలిపారు.