
షాద్నగర్‌లో 700 మందికి పైగా ఉచితంగా చావా సినిమా ప్రదర్శన!
( పయనించే సూర్యుడు మార్చి 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న గారి ఆధ్వర్యంలో “చావా” సినిమా ఉచిత ప్రదర్శన ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 700 మందికి పైగా ప్రజలు హాజరై సినిమాను వీక్షించి ఎంతో ఉత్సాహంగా స్పందించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రత్యేక ప్రదర్శనను ఆస్వాదించడంతో పాటు, సినిమాలోని సందేశాత్మక అంశాలను మెచ్చుకున్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు బీజేపీ నాయకులు ప్రశాంత్ ముదిరాజ్ గారు బాబన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల కోసం, సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం నిజంగా అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో కూడా బీజేపీ నాయకత్వం ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఇంకా సంఘీ పరివార్ ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, యువ నాయకులు పాల్గొని ప్రదర్శనను విజయవంతం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా బాబన్న గారి సేవా కార్యక్రమాలను కొనియాడారు. షాద్నగర్ పట్టణంలో బీజేపీ నాయకులు ప్రజల కోసం చేపడుతున్న ఈ సామాజిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.