Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్వంద రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్యలో ఉపాధిలో భారీ కోత

వంద రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్యలో ఉపాధిలో భారీ కోత

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 24 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

2.54 లక్షలు తగ్గిన వంద రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్య దళితుల్లో నలబై ఒకటి శాతం తగ్గుదల మోడీ సర్కారు బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులను ప్రతి సంవత్సరం తగ్గిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తుండగా, పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు వంద రోజులు పనికల్పించకుండా రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం కూడీ అదే బాటలో నడుస్తోంది. రాష్ట్రంలో ఉపాధి పనుల్లో భారీ కొత పడుతోంది. దరఖాస్తు చేసుకున్న వారికందరికీ వంద రోజుల పాటు పనిచూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వంద రోజులు పనిచేసిన వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. దళితుల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది.తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పనిని 4,32,834 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. గత ఏడాది వంద రోజులు పనులు చేసిన వారి సంఖ్య 6,87,396గా నమోదైంది. దానితో పోలిస్తే వందరోజుల పనులు చేసిన కుటుంబాల సంఖ్య 38 శాతం 2,54,562 తగ్గింది. ఇంత భారీ సంఖ్యలో తగ్గుదల నమోదుకావడం అధికారవర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. పెరిగిన నమోదులు.. వందరోజులు పనులు చేసిన కుటుంబాల సంఖ్య తగ్గిందంటే ఆ పనులకు డిమాండ్‌ తగ్గిందని అర్ధం కాదు. నిజానికి పనుల కొరత తీవ్రంగా ఉండటంతో గత ఏడాది కంటే ఈ ఏడాది అధికారిక సమాచారం ప్రకారమే 3.33 లక్షల కుటుంబాలు అదనంగా ఉపాధి పనుల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. 2023-24లో 67.98 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులు పొందగా, 1.21 కోట్ల మంది వేతనదారులు ఉన్నారు. 2024-25లో 70 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులు పొందగా, ఈ కుటుంబాల్లో 1.22 కోట్ల మంది వేతనదారులు ఉన్నారు. జాబ్‌కార్డుల పొందిన కుటుంబాలు కానీ, పనుల కోసం ఎదురుచూసే వేతనదారులు గాని గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదే ఎక్కువ వారందరికీ పూర్తిస్థాయిలో పనులు మాత్రం లభించలేదు.
దళితులపై తీవ్ర ప్రభావం ఇదే సమయంలో ఈ పనులపై ఆధారపడిన దళితుల్లో వంద రోజులు పనులు పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే నలబై ఒకటి శాతం తగ్గింది. గతఏడాది 1,37,511 కుటుంబాలు వంద రోజులు ఉపాధి హామీ చట్టం కింద పని చేస్తే ఈ ఏడాది వీటి సంఖ్య 81,761 మాత్రమే! గిరిజనుల్లో కూడా 6శాతం తగ్గుదల నమోదైంది. ఇక జిల్లాల వారీగా ఈ కుటుంబాల సంఖ్యను పరిశీలిస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా 63,029 కుటుంబాలతో తొలి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో శ్రీకాకుళం జిల్లా 42,571 కుటుంబాలతో నిలిచింది. 1,328 కుటుంబాలతో గుంటూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఫిర్యాదులూ ఎక్కువే రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం అమలుపై ఫిర్యాదులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అనేక చోట్ల యంత్రాలు వినియోగం జరుగుతోది. నకిలీ మస్తర్లతో పనులు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపైన అనేక చోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనం ప్రకారం గిరిజనుల్లో నలబై శాతం మందికి జాబ్‌కార్డులు లేవని తేలింది. పదముడు శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవు. ఉపాధి హామీ చట్టం ప్రారంభమైన కొత్తంలో ఆ పథకాన్ని ఆ పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రాల జాబితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లభించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోవడం పట్ల పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments