Saturday, April 19, 2025
Homeతెలంగాణఏన్కూర్ మండల కేంద్రంలో దారి తప్పిన డ్రైనేజీ వ్యవస్థ దుస్థితి

ఏన్కూర్ మండల కేంద్రంలో దారి తప్పిన డ్రైనేజీ వ్యవస్థ దుస్థితి

Listen to this article

పయనించే సూర్యుడు. మార్చి 25. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ ;భావుసింగ్ నాయక్ :పక్కనే గర్ల్స్ హై స్కూల్ డ్రైనేజీ శుభ్రపరచకపోవడం వల్ల స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంటుంది మండల అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు .డ్రైనేజీ వ్యవస్థ దయనీయ స్థితి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధాన రహదారి అయినా ఖమ్మం టు భద్రాచలం రోడ్డు నిత్యం మండలంలో 2000 నుండి 3000 మంది వరకు వారి యొక్క నిత్య అవసరాలు కొరకు ప్రయాణం చేస్తూ ఉంటారు అక్కడే హోటల్స్ పండ్ల దుకాణాలు ఫ్యాన్సీ దుకాణాలు స్ట్రీట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వంటి అనేక రకాల దుకాణాలు ఉన్నటువంటి ప్రదేశంలో వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్లాస్టిక్ కవర్లను పడేయడం వల్ల పర్యావరణం కాలుష్యం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలినిత్యం మండల అధికారులు ఉద్యోగరీత్యా ఉద్యోగాలు నిర్వహిస్తున్న కానీ ఇటువంటి దుస్థితిని చక్కదిద్దలేకపోతున్నా రు చెత్తాచెదారంతో నిండిపోయిన డ్రైనేజీ కాలువలు, మురుగునీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి, దుర్వాసనతో కూడిన వాతావరణం ఇవన్నీ ఇక్కడి ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పట్టించుకోని వైఖరి వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఒకప్పుడు స్వచ్ఛంగా, సాఫీగా ప్రవహించే డ్రైనేజీ కాలువలు ఇప్పుడు చెత్త కుప్పలతో నిండిపోయాయి. ప్లాస్టిక్ సంచులు, ఖాళీ బాటిళ్లు, గుడ్డలు, ఇతర వ్యర్థాలు కాలువలను మూసుకుపోయేలా చేశాయి. దీని వల్ల మురుగునీరు ప్రవహించక, చుట్టుపక్కల ప్రాంతాల్లో చేరి, దోమలు, ఈగల సమస్యను తీవ్రతరం చేస్తోంది. ఇది డ్రైనేజీ కాలువ కాదు, చెత్త కుండీ అయిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు,”అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు మాత్రం ఈ సమస్యపై నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తున్నారు. డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. కానీ ఇలాంటి ప్రాథమిక సమస్యలు పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రారు,” అని గ్రామస్తులు విమర్శించాడు. ప్రభుత్వం, స్థానిక అధికారులు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించి, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments