
అక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూమి కాపాడాలని డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బైర్ఖాన్ పల్లి గ్రామస్తులు
పయనించే సూర్యుడు మార్చి 25 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ :కేశంపేట మండల పరిధిలోని బైర్ఖాన్ పల్లి గ్రామంలో 53/37 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేయుటకు కొందరు యత్నిస్తున్నారని భైర్ ఖాన్ పల్లి గ్రామస్తులు మంగళవారం కేశంపేట డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. నెల రోజుల క్రితం ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు.మళ్ళీ గత కొన్ని రోజులుగా కొందరు అక్రమార్కులు హద్దురాలను తీసే ప్రయత్నం చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేయుటకు యత్నిస్తునారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కావున ఆక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని బైర్ ఖాన్ పల్లి గ్రామస్తులు అధికారులకు వేడుకుంటున్నారు. అక్రమార్కుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తాహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామ మాజీ సర్పంచ్ రాఘవేందర్ రావు, రైకంటి రామచంద్రయ్య, కృష్ణయ్య, కోట్ల ఆంజనేయులు, అఖిల్ తదితరులు ఉన్నారు.