
రుద్రూర్, మార్చ్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ శివారులో 2014 వ సంవత్సరంలో జగిరిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతికి కారణమైన ఇద్దరు డ్రైవర్ల పై 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపి జైలు శిక్ష విధించినట్లు బుధవారం బోధన్ న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. అక్బర్ నగర్ గ్రామ శివారులో తుఫాన్ వాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి నలుగురు మృతికి కారణమైన నాందేడ్ జిల్లాకు చెందిన తుఫాన్ డ్రైవర్ శివాజీ బాలరాం బల్కి కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, 3 వేల రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లిన కోటగిరి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ మాజీద్ కు మూడు నెలల కఠిన కారాగార శిక్ష, 500 రూపాయల జరిమానా విధించినట్లు న్యాయమూర్తి శ్రీ సాయి శివ తీర్పు వెల్లడించారు. నలుగురు ప్రాణాలను బలిగొన్న ఈ రోడ్డు ప్రమాదం కేసులో పిపి సీహెచ్ రాణి సాక్షులను బ్రీఫ్ చేసి వాదనలు వినిపించడం జరిగింది.