
పయనించే సూర్యడు // మార్చ్ // 27 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
తెలంగాణ బిసి అసంఘటిక కార్మిక సంఘం జమ్మికుంట మండల ఆధ్యక్షురాలిగా జమ్మికుంట పట్టణానికి చెందిన కూనిరాజు నందిని ని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతు…వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ,వ్యాపార సముదాయాల్లో పని చేసే కార్మికులకు కావలసిన మౌలిక వసతులు అందేలా కృషి చేయాలనీ సూచించారు . తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూనిరాజు నందిని కృతజ్ఞతలు తెలిపారు