
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ల పై వాదనలు పూర్తయ్యాయి.
ఈరోజు స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ, ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ వాద నలు వినిపించనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏడాది దాటినా స్పీకర్ చర్యలు తీసుకోలేదు అని బిఆర్ఎస్ వాదిస్తుంది.. బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఎంపీగా ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. స్పీకర్ అనర్హత చట్టాన్ని అమలు చేయాలని, కోర్టులు ఎందుకు కోరవద్దని టిఆర్ఎస్ వాదిస్తుంది, ఇప్పటికే ఫిరాయింపుల కేసులు స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేసింది..