
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ // హుజురాబాద్..
శ్రీరాములపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల సురేష్ ఆధ్వర్యంలో, చౌక ధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని పేర్కొన్నారు. పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు.ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా,కొనసాగుతుందని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.సన్న బియ్యం పంపిణీ పధకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గుత్తికొండ రవికుమార్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గైకోడి రాజు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ గొడుగు శైలజ, కాంగ్రెస్ నాయకులు మేకల రామస్వామి, ఎల్లయ్య, సంజీవ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.