
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్ టిప్పర్స్, లారీ ఓనర్స్ యూనియన్ కార్యాలయాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం ప్రారంభించారు. టేకులపల్లి మండల కేంద్రం నుంచి బోడు గ్రామానికి వెళ్లే మార్గంలోని సుకాలబోడు స్టేజీ సమీపంలో లారీ కార్యాలయం, లారీలు నిలుపుకునేందుకు యార్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. టేకులపల్లి ప్రధాన రహదారి మీదుగా, బోడు రోడ్ సెంటర్ ఊరేగింపుగా చేరుకొని బానసంచాలు కాల్చారు. ర్యాలీ ప్రదర్శనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.యూనియన్ కార్యాలయాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేని కోయగూడెం ఓపెన్ కాస్ట్ టిప్పర్స్, లారీ ఓనర్స్ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం ఓపెన్ కాస్ట్ టిప్పర్స్, లారీ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు నేలవెల్లి నర్సింహారావు, గౌరవ అధ్యక్షులు కోరం సురేందర్, ఉపాధ్యక్షులు బోడ మంగీలాల్, ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్, యూనియన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, చిట్టి బాబు, మోకాళ్ళ పోషాలు, ఇస్లావత్ రెడ్యానాయక్, బానోత్ రవి, లక్ష్మయ్య, ముచ్చా సుధాకర్, ధర్మయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.