
వాజేడు మండలంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో సన్నబియ్యం పథకం పంపిణీ.
ముఖ్య అతిగా పాల్గొన్న స్థానిక ఎంఎల్ఏ, తెల్లం వెంకట్రావు.
పయనించేసూర్యుడు:ఏప్రిల్03. ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు:ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సన్న బియ్యం పంపిణి కర్యమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ,
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పేదప్రజలకు పౌష్టకాహారం అందించాలని ఉద్దేశంతో నేటి నుంచి ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందనీ తెలియజేశారు.అంతేకాకుండా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా వాజేడు రేషన్ లో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇది పేద ప్రజల ప్రభుత్వం అని మరో మారు నిరూపించారని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.
ఈయొక్క కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
