
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 5(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి గ్రామం లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఆవరణం నందు స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ గారి 118 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు నరసింహులు, ఉపాధ్యక్షుడు సూర్యుడు, కుళ్లాయప్ప ఆదినారాయణ, చిన్న రాముడు, టీ నాగరాజు, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
