
పయనించే సూర్యుడు న్యూస్// 7 తేదీ ఏప్రిల్ నారాయణపేట జిల్లా
POW రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి
POW జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షతన PoW జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని ఊదర పలుకులు పలుకుతున్నారు. కానీ కింది స్థాయి గ్రామాల్లో ఆ రేషన్ బియ్యం తీసుకోవాలన్న రేషన్ కార్డులో పేరు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటికి 16 నెలలు గడుస్తున్నా ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయకపోవడం అవి మంజూరు చేసిన కూడా గందరగోళంగా ఉండడం ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల పిల్లల పేర్ల మీద రేషన్ కార్డులు రావడం రేషన్ డీలర్లు అయోమయానికి గురి కావడం మొత్తం ఈ రేషన్ కార్డులు ఎవరికి వచ్చాయో తెలవని గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది అన్నారు POW రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి ఈరోజు వారి జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసి మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి మీ సేవలో రేషన్ కార్డులో పేరు నమోదు కోసం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కొన్ని వేలల్లో పెండింగ్లో ఉన్నాయి అవి పరిష్కరించకుండా కొత్తగా సన్నబియమిస్తున్నామని ఊదర పలుకులు పలుకుతున్నారని అన్నారు. అలాగే 500 గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనే ఉంది . తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న సమాచారం సర్వే ప్రకారం 500 రూపాయలకు ఇస్తున్నామని చెబుతున్న సిలిండర్ సబ్సిడీ రాష్ట్రం మొత్తం 50% కూడా అమలు కావడం లేదు . దీనికి ముఖ్య కారణం లబ్ధిదారులకు రేషన్ కార్డు లేకపోవడం ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డు ఉన్న అది లింకు ఉండాలనే నిబంధన ఉండడం వల్ల చాలామంది సిలిండర్ సబ్సిడీ కోల్పోయే పరిస్థితి ఉంది అలాగే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఒకటే కాదు 12 రకాల నిత్యవసరసరుకులు
పప్పు గోధుమలు చక్కెర వంటనూనె చింతపండు లాంటి నిత్యవసర సరుకులు రేషన్ డీలర్ షాపుల ద్వారా ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఏప్రిల్ 7 8 9 తేదీలలో మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో లకు వినతి పత్రాలు ఇవ్వాలని 10వ తేదీన జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై ఆఫీసర్ కు వినతి పత్రాలు ఇవ్వాలని POW PYL సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వాలని జిల్లా కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
సమావేశంలో జిల్లా POW ప్రధాన కార్యదర్శి సౌజన్య. ఉపాధ్యక్షురాలు లక్ష్మి సహాయ *కార్యదర్శి భాగ్యలక్ష్మి. కోశాధికారి మహాదేవి జిల్లా కమిటీ సభ్యులు సరళ లక్ష్మి సావిత్రమ్మ అనిత రాధిక అరుణ సుజాత మంజుల చంద్రకళ పాల్గొన్నారు
