
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో 08-04-2025 సాయంత్రం 5 గంటల నుండి 12-04-2025 వరకు చౌడమ్మ గుట్ట నుండి యాదగిరిగుట్ట వరకు విశాలమైన ప్రజా పాదయాత్రను నిర్వహించబోతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.ఈ పాదయాత్ర ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విజయాన్ని ప్రజలతో పంచుకోవడం కోసం, మరియు మహబూబ్‌నగర్ పార్లమెంటుకు మొట్టమొదటి మహిళా ఎంపీ డీకే అరుణ గెలిచిన గర్వాన్ని ప్రజల మధ్య చాటిచెప్పేందుకు చేపడుతున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి విముక్తి చేసి బీజేపీ చేతిలో పెట్టాలని యాదగిరి నరసింహ స్వామిని వేడుకుంటూ, ఆయన ఆశీస్సులతో ఈ పాదయాత్ర ప్రారంభమవుతోంది. ప్రజల భూములను అమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వం, దళిత,గిరిజన, బీసీ, పేదల సంక్షేమానికి సంబంధించిన ఆరు ప్రధాన పథకాలను అమలు చేయకుండా ప్రజలను దోచుకుంటోంది. ఈ దుర్వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం పెంచి ఉద్యమ జ్వాల రగిలించేందుకు ఈ పాదయాత్ర నిక్షిప్త సంకేతంగా నిలుస్తుంది.ఈ యాత్రలో పాల్గొనదలచిన వారు ముందుగా తమ పేర్లు నమోదు చేయగలరని షాద్‌నగర్ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.