
పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
బాలనగర్ డివిజన్ నూతన బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ నలబై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొనగా బాలనగర్ డివిజన్ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు తదనంతరం డివిజన్ లోని జాతీయ రహదారిపై హోండై షోరూం ఎదుట ఏర్పాటుచేసిన బీజేపీ జెండాను వారు ఆవిష్కరించారు, అనంతరం రాజేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తు, పార్టీ స్థాపించిన నలబై ఐదు సంవత్సరాల లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందనీ,1984 లో కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచిన పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీ బిజెపి పార్టీ అని,ఎంతోమంది పార్టీ కార్యకర్తలు నాయకుల త్యాగ ఫలితమే ఈరోజు ఈ ఘనత సాధించడం అని వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి కొత్తురి రమేష్, డివిజన్ మాజీ అధ్యక్షుడు జి.రమేష్,డివిజన్ లోని బిజెపి నాయకులు,కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.