
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పట్టణం, సత్యనారాయణపురం నివాసి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కోరం కనకయ్య అభిమాని గోనెల సిద్దయ్యనిన్న సాయంత్రం హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఇట్టి విషయం తెలుసుకున్న ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపి, కుటుంబానికి అండగా నేనున్నానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, ఎర్రసంగి వెంకన్న మాజీ కౌన్సిలర్ వార రవి, దొడ్డ డానియల్, పూణెం సురేందర్, పాయం కృష్ణ ప్రసాద్, డి శివకుమార్, సైదా మియా, అఫ్రీద్, సత్యనారాయణపురం ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు