Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహారం కోసం రోగుల ఆగ్రహం

బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహారం కోసం రోగుల ఆగ్రహం

Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 11 :-రిపోర్టర్ (కే శివ కృష్ణ )

  9 /5/ 2025 బుధవారం సాయంత్రం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి బాపట్ల 24వ వార్డు డ్రైవర్స్ కాలనీకి చెందిన అఖిలభారత రైతు కూలీ సంఘం మాజీ నాయకులు ఎస్కే మస్తాన్ వలీ ని మంగళవారం రాత్రి 108 అంబులెన్స్ లో బాపట్ల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది. మస్తాన్ వలీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ ,ప్రగతిశీల యువజన సంఘం నాయకులు SD  హఫీబుధవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. అయితే మస్తాన్ వలీ అదే రోజు రాత్రి గుంటూరు జనరల్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారని తెలుసుకొని పురుషులు వైద్యం పొందే జనరల్ వార్డు నుండి బయటకు వస్తున్న సమయంలో అదే వార్డులో బాపట్ల విలేకరిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని చికిత్స పొందడానికి చూసి పలకరించి మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో నర్సులు వైద్యం అందించే రూమ్ వద్ద రోగులకు సంబంధించిన మహిళలు మరియు రోగులు ఆసుపత్రిలో బోజన పంపిణీ చేసే వారిపై ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. ఏమిటని పరిశీలించగా భోజనం నాసిరకంగా ఉందని నీళ్ల సాంబారు తినడానికి వీలులేని విధంగా ఉందని రోగులకు ఆసుపత్రి భోజన కాంట్రాక్టర్లు ఇటువంటి అన్నాన్ని పెడుతున్నారని రోగులు ఏ విధంగా తింటారని ప్రశ్నిస్తూ అరుస్తున్నారు. అలాగే ఈరోజు నిన్న( మంగళ బుధవారాల్లో) ఆసుపత్రిలో వైద్యం సరిగా  ఉన్నాయా లేవా అనే విషయాలు మీద వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పరిశీలన చేసి రోగులకు సహాయకారిగా ఉండే వారిని ఆసుపత్రిలో వైద్యం అందుతున్న తీరుపై విచారించారని వైద్యం అందుతున్నది కానీ భోజనమే తినడానికి వీలుపడడం లేదని నాసిరకం కూరలు వాసన వచ్చే అన్నం నీళ్ల సాంబార్లు పెట్టి వేధిస్తున్నారని ఈ భోజనాలు ఎవరు తినకుండా పడ వేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది స్పందించాలని అన్నారు.ముఖ్యంగా ఆసుపత్రి సూపర్డెంట్ గారు పరిశీలించి నాసిరకం భోజనం అందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రోగులు,రోగులు బంధువులు కోరారు. ఎక్కడెక్కడి నుండో వైద్యం కోసం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి వస్తున్నామని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోలేక కుటుంబాలకు ఆర్థిక శక్తి లేక అప్పులతో అల్లాడుతున్న మేమంతాప్రభుత్వ ఆసుపత్రి వైద్యం కోసం వస్తున్నామని పేదల కొరకు ఏర్పాటు చేసిన ఆసుపత్రులలో ఇటువంటి నాసిరక ఆహారం అందిస్తే ఏ విధంగా శక్తి పుంజుకొని మేము ఆరోగ్యవంతులం అవుతాము . మాకు వైద్యం బాగానే అందుతుంది కానీ ఆహారం అందటం లేదు కనుక మమ్మల్ని పట్టించుకోండి అంటూ ఈ సందర్భంగా అక్కడే ఉన్నటువంటి అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ తో  వారు పడుతున్న బాధను వెల్లడించారు.రేపు ఉదయం సూపర్నెంట్ తో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార దిశగా చూద్దామని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ  దృష్టికి కూడా తీసుకువెళదామని సర్ది చెప్పడం జరిగింది .ఒక రోగికి భోజన సదుపాయనిమిత్తం ఆసుపత్రిలో రోజుకి 100 రూపాయలు నిధి కేటాయించే విధంగా ఆలోచించి నిధులు విడుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ డిమాండ్ చేశారు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments