
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలోని వెంగమ నాయుడు కాలనీలో గురువారం చేనేత కార్మిక సంఘం 90వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా చేనేత కార్మికులు, కాలనీవాసులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి పామిశెట్టి గోవిందు, జిల్లా సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాసులు, హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలూరు లక్ష్మయ్య చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీలూరు లక్ష్మయ్య, పామిశెట్టి గోవిందు, జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ దేశంలో రెండవ అతి పెద్ద రంగం చేనేత రంగమని , అలాంటి చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి కేటాయించిన రిజర్వేషన్లను అమలు పరచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్ల, చేనేత మగ్గాలపై తయారు చేసే 11 రకాలను తయారీ ఉత్పత్తులను పవర్ లూమ్ మీద తయారు చేయడం వల్ల,చేనేత కార్మికుల చీరలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన హామీ నేతల నేస్తం 24 వేల రూపాయలను పెంచి నేతన్న నేస్తం అందిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు చేనేతలకు రెండు వేల కోట్ల రూపాయలు. నిధులు కేటాయించి ఆర్థిక భరోసా కల్పించాలన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి చేనేతలకు అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కుల్లాయి రెడ్డి పెద్దవడుగూరు సిపిఐ మండల సహాయ కార్యదర్శి పోలా రంగస్వామి, పుట్లూరు నరసింహులు వెంకటస్వామి ,,ఆంజనేయులు చేనేత కార్మికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
