
ప్రభుత్వాలు విద్య కార్పొరేట్,ప్రైవేటీకరణను అరికట్టాలి.
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే కు ఘన నివాళులు.
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 12//మక్తల్
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమాన్ని మక్తల్ లోని పూలే చౌరస్తా లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అట్టడుగు వర్గాల ప్రజలకు విద్యను అందించాలని పోరాటం చేయడంతో పాటు సమాజంలో కుల అసమానతలపై పోరాటం చేశారు. నాణ్యమైన విద్య కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే కార్పొరేట్, ప్రైవేట్ విద్యా పేరుతో అందుతుంది. బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ బడులలో అసమానతులతో కూడుకున్న విద్య అందిస్తూ సరైన వసతులు లేక బోధన సౌకర్యాలు లేక నాసిరకం విద్యను ప్రభుత్వం అందించడం మనువాద భావజాలమే అవుతుంది. సమాజంలోని సబ్బండ కులాలకు, సబ్బండ వర్గాల ప్రజలకు ఒకే రకమైన విద్య అందించడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు సమూచితమైన గౌరవం దక్కుతుందనీ అన్నారు. దేశంలో రోజురోజుకు ప్రజల మధ్య కులాల పేరుతో అసమానతలు పెరిగిపోతూ మనిషిని మనిషి చంపుకునే రోజులు చూస్తున్నాము. కులాల పేరుతో మతాల పేరుతో మనుషులు చంపుకుంటుంటే ప్రభుత్వాలు కనీస సామాజిక సంస్కరణలకు పూనుకోవడం లేదు. కావున మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో అట్టడుగు వర్గాల ప్రజలు ఏకతాటిపై ఉంటూ కుల నిర్మూలనకు పాటుపడుతూ ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని అప్పుడే మహాత్మ జ్యోతిబాపూలే కు మనమిచ్చే నిజమైన నివాళి అవుతుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి నారాయణ,బీఎస్పీ జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్, టీవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మద్దిలేటి,ఆర్టీఐ జిల్లా నాయకులు గొల్లపల్లి నారాయణ,పుడమి ఫౌండేషన్ చైర్మన్ వేంకటపతి రాజ్, అంబేద్కర్ యువజన సంఘం క్రియాశీలక సభ్యులు బ్యాగరి శ్రీహరి, కర్రెం లింగప్ప,సురేష్, లోకె క్రాంతి కుమార్,కృష్ణ,డోగి అజయ్,తేజ తదితరులు పాల్గొన్నారు.
