
పయనించే సూర్యుడు న్యూస్ 11 తేదీ ఏప్రిల్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవర్గం
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆధునిక భారతదేశ సామాజిక తత్వవేత్త,సత్యశోదక్ సమాజ్ స్థాపకుడు అంటరాని వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిభాఫూలే గారి 198వ జయంతి కార్యక్రమాన్ని ఆ సంఘం వ్యవస్థాపకులు వాకిటి ఆంజనేయులు ముదిరాజ్ సంఘం కోశాధికారి రాజు సార్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల సమర్పించారు. మక్తల్ పట్టణ అధ్యక్షుడు గుంటి రఘు ఆధ్వర్యంలో ఉప్పరపల్లి స్టేజి సమీపంలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రతిమ దగ్గర నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనాభా ప్రాతిపదికన అధికంగా ఉన్నప్పటికీ సరైన న్యాయం పొందలేకపోతున్నాం నాడు మహాత్మ జ్యోతిరావు పూలే అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. స్త్రీ విద్య కొరకు నిమ్నజాతి వర్గా అభ్యున్నతిని కోరుతూ వాళ్లకు చదువు నేర్పించడం మరియు సామాజిక అసమానతలను తొలగిం చుట కొరకు స్వయంగా తనే పాఠశాలలను స్థాపించి భార్య సావిత్రిబాయి పూలే గారికి ముందుగా చదువు నేర్పించి ఆమె తోడుతో సమాజంలో ఉన్న మహిళలకు విద్యను అభ్యసింప చేయించి ఎన్నో ఘోర అవమానాలను భరించి పోరాడాడు. కానీ నేటి సమాజం యువకులు రాజకీయ నాయకులు వారి అడుగుజాడల్లో నడవాల్సింది పోయి పుట్టినరోజు జయంతులు జరపడం మరణించిన రోజు శ్రద్ధాంజలి ఘటించడం తప్ప వారి అడుగుజాడల్లో ఎంతవరకు మనం ప్రయాణం చేస్తున్నామనేది ఆలోచించవలసిన అవసరము చాలా ఉంది. ముఖ్యంగా సామాజిక అసమానతలు తొలగాలంటే ఇలాంటి మహానుభావుల చరిత్రను పిల్లలకు పెద్దలకు తెలిపితే చాలు వాళ్లకు ఎంతో మోరల్ వాల్యూస్ నేర్పిన వాళ్ళం అవుతాం కనుక బహుజనలారా ఇప్పటికైనా మనం వారి అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. మక్తల్ పట్టణ అధ్యక్షుడు గుంటి రఘు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ పెద్దలపట్ల బాధ్యతలు పెరగాలంటే ప్రతి పాఠశాలలో ఇలాంటి నాయకుల గురించి విద్యార్థులకు బోధించాలి పాఠ్యపుస్తకాలలో వీరిని గురించి పాఠాలు ఉండాలి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇట్టి కార్యక్రమంలో గుంతలి రమేష్ గుంతలి ఆంజనేయులు ఉప్పరి రాజు టి నరేష్ కురువ ఆంజనేయులు రహమత్ కురువ బాలు అప్పి శేఖర్ మంగలి రవికుమార్ వడ్ల నరేష్ వెంకటేష్ మేస్త్రి సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.