Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి ఉత్సవాలు

మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి ఉత్సవాలు

Listen to this article


పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్


నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రసంగిస్తున్న చైర్మన్ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఈరవత్రి అనిల్ నిజామాబాద్‌లో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవ జ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే 199 జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. • మహాత్మా జ్యోతిబాపూలే గురించి 200 సంవత్సరాల తర్వాత కూడా స్మరించుకుంటున్నామంటే ఆ మహానీయుడి గొప్పదనాన్ని అర్ధం చేసుకోవచ్చు. • దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్లు దాటిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం హక్కులు ప్రసాదించినప్పటికీ ఇప్పటికీ మనం కుల వివక్షను ఎదుర్కొంటున్నాం. మరీ 200 సంవత్సరాల క్రితం పూలే ఎంతటి వివక్షను ఎదుర్కొని ఉంటారో ఊహించుకోండి. • శరీరాన్ని బానిసగా చేసిన ఫర్వాలేదు, కానీ మనసును బానిసగా మార్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు అని గులాంగిరి పుస్తకంలో పూలే పేర్కొన్నారు. మనం ఇప్పటికీ బానిసలుగా బతుకుతున్నాం. మనసును బానిసగా మార్చుకుంటున్నాం. దీన్ని అధిగమించాలని పూలే బలంగా వాదించారు. • అనాటి సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉండేది. మహిళలు చదువుకోవడం కూడా హిందూ సమాజంలో పెద్దనేరంగా భావించే వారు. సావిత్రాబాయి పూలే కూడా ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నారు. అయినా మహిళల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించి వారికి విద్యాబుద్ధులు నేర్పిన మహానీయురాలు సావిత్రాబాయి పూలే గా. ఇన్నీ మంచి పనులు చేస్తున్నందుకు కూడా సొంత కుటుంబ సభ్యులే వారిని దూరం పెట్టారు. • అనాటి సమాజంలోని అంటరానితనం, అసమానతలు, అస్పృశ్యతను రూపుమాపేందుకు పూలే తన జీవితాంతం ప్రయత్నించారు. అందుకోసమే 200 సంవత్సరాల తర్వాత కూడా వారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. • దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ కూడా పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. గాంధీ స్వయంగా మహాత్మా అని సంబోంధించిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబాపూలే. • మొన్న జరిగిన తెలంగాణ సమగ్ర కులసర్వేలో బీసీలు 56.33 శాతమని తేలింది. బీసీల నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు కావాలని ఆరాటపడుతుంటారు. కానీ పూలే మహానీయుని జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆశించిన మేర బీసీలు హాజరుకాకపోవడం సమంజసం కాదు. • అంబేద్కర్ పూలే ని ఆదర్శంగా తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ ని అడ్డంపెట్టుకొని అంబేద్కర్ ఆశయాలను, విజ్ఞానాన్ని అవమానిస్తున్నారు. • ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ ఇద్దరూ కులవివక్షను ఎదుర్కొన్నారు. శివాజీ పట్టాభిషేక సమయంలో.. నీవు క్షత్రియుడివి కాదు నీకు ఎట్ల పట్టాభిషేకం చేస్తామని అప్పటి బ్రహ్మణులు శివాజీని అవమానించారు. దీంతో ఆయన వేరే ప్రాంతం నుంచి బ్రహ్మణులను రప్పించి పట్టాభిషేకం చేయించుకున్నాడు. • శివాజీ కూడా బీసీనే. శివాజీ గొప్ప వీరుడు. మొఘలులు కూడా శివాజీని ఓడించలేకపోయారు. అంతటి వీరు చరిత్రను బయటికి తీసిందెవరూ. శివాజీ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిందెవరూ. రాయ్‌గఢ్ కోటలో ఉన్న శివాజీ సమాధిని వెలికితీసింది మహాత్మా జ్యోతిబాపూలే. శివాజీ పుట్టిన 200 సంవత్సరాల తర్వాత జన్మించిన పూలే.. ప్రపంచానికి శివాజీ గొప్పతనాన్ని పరిచయం చేశారు. • నేడు బీజేపీ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోంది. మత, కుల ప్రాతిపదికన సమాజాన్ని విభజించాలి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. అటువంటి పార్టీ మనకు అవసరమా? • కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు చట్టసభలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులను శాసనసభలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపింది. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. • దేశ వ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే మన ఎంపీ కులం ఏముంది గుణం ముఖ్యం అంటుండు. బీసీలకు కులం లేదా. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ సంగతి రాజకీయంగా చూసుకుందాం. • బీసీలుగా మనం 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మన కోసం, మన బిడ్డల కోసం, భవిష్యత్ తరాలకు న్యాయం జరిగేలా ఈ 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునే వరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలి. • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ముస్లింలను బీసీల్లో చేర్చారనే సాకుతో రిజర్వేషన్లకు అడ్డుపడే ప్రయత్నం చేస్తోంది. • అనాడు మండల్ కమిషన్ బీసీలు 52 శాతం మంది ఉన్నారు అని పేర్కొంది. వారిలో 44 శాతం హిందూవు బీసీలు, 8 శాతం మంది ముస్లిం బీసీలు ఉన్నారని నివేదిక ఇచ్చి బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దానికి ప్రకారం ముస్లింలు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారు?
• ప్రధాని మోదీ గారి కులమైనా గాన్షి హిందూవుల్లో ఉంది, ముస్లింలలో కూడా ఉంది. వారు కూడా బీసీ రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు. మటన్ కొట్టే ఖురేషీలు కూడా బీసీ జాబితాలో ఉన్నారు. • మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈడబ్ల్యూసీలో కూడా ముస్లింలు ఉన్నారు. సయ్యద్ లు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు. మరి దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారు? • ఏదో ఒక సాకుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలి అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద మనందరం పోరాటం చేయాలి. • మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల వల్ల మన బీసీ బిడ్డలు నష్టపోతున్నారు. నీట్ పరీక్షను తీసుకుంటే 24 లక్షల మంది రాసిన పరీక్షలో 10 లక్షల 28 వేలు ఓబీసీలు, ఈడబ్ల్యూసీలు లక్షా 88 వేలు. బీసీల్లో 1 సీటుకు 35 మంది పోటీపడితే ఈడబ్ల్యూసీలలో 1 సీటుకు 15 పోటీపడుతున్నారు. • ఇది అన్యాయం కాదా. మన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే చూస్తే కూర్చోవాలా. మతం ముసుగులో పడితే మన పిల్లలకు అన్యాయం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతాం. • కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడింది. రాహుల్ గాంధీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చట్టసభలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుంది.
• గత పదేళ్లలో విద్యార్ధులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. 57 వేల ఉద్యోగాలు ఇచ్చాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments