
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి )
యాడికి తహసిల్దార్ ప్రతాపరెడ్డి మండల రైతులకు మామిడి, అల్ల నేరేడు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మొక్కలను రైతులు సంరక్షించుకోవాలన్నారు. ప్రతి రైతు తమ పొలాల్లో ఒక మొక్కను పెంచుకుంటే కాలుష్య నివారణ తగ్గి వర్షాలు కురుస్తాయన్నారు. వచ్చే వర్షాకాలంలో ప్రతి రైతుకు ఒక మొక్కను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు, వీఆర్వో దామోదర్ నాయుడు, భీమేశ్వర్ రెడ్డి, రైతులు హరి, రఘు, ఐ టి డి పి అధ్యక్షుడు నరసింహ చౌదరి, సెల్ పాయింట్ చాంద్ బాషా, నీలకంఠ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు