
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులంతా ఆశ్రమంలోని నిరాశ్రయుల మధ్యలో కేక్ కటింగ్ చేశారు.అలాగే భోజనాలు ఏర్పాటు చేసి వారికి అన్నదానం కూడా చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా అందరికీ ఆయన సుపరిచితుడే. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా పనిచేశారు. సమాజంలో ఆయన ఆలోచన విధానం మార్పు తెచ్చేవిగా ఉంటాయి. ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని ఎంతగానో ఆయన కృషి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని జ్ఞాపకం చేసుకొని అగాపే ఆశ్రమంలో వేడుకగా జరిపి నివాళి అర్పించి ఈ విధంగా అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని నగరూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రజలంతా ఆనంద వ్యక్తం చేశారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఎంతో సంతోషించారు
