Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

Listen to this article

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని వివిధ గ్రామాలలో నారాయణపేట అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 15//

ఉట్కూర్ మండలం బాపూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షులు మహేష్ ఆవిష్కరించారు జిలాల్ పూర్ & బైరంకొండ బం డగొండ గ్రామాలలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించారు జాతర జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ అద్భుతమైన విద్యావేత్త, ఆర్థికవేత్త, న్యాయవాది మరియు రాజనీతిజ్ఞుడు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించి, డాక్టరేట్ సాధించిన తొలి భారతీయుల్లో ఒకరు. ఆయన రచనలు, ప్రసంగాలు సామాజిక న్యాయం కోసం శక్తివంతమైన ఆయుధాలుగా నిలిచాయి.భారత రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర అసమానం. రాజ్యాంగ రచనా సభలో చైర్మన్‌గా, భారతదేశానికి స్వాతంత్ర్యం, సమానత్వం, సోదరభావం వంటి ఆదర్శాలపై ఆధారపడిన బలమైన పునాదిని అందించారు. మహిళల హక్కులు, కార్మికుల శ్రేయస్సు, విద్యా సంస్కరణలు—ప్రతి రంగంలో ఆయన దార్శనికత అపూర్వం.అంబేద్కర్ జీవితం ఒక స్ఫూర్తి. పేదరికం, వివక్షల మధ్య జన్మించి, తన ఆత్మగౌరవం, అసాధారణ పట్టుదలతో ప్రపంచాన్ని ఆలోచింపజేసిన నాయకుడు. బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి, లక్షలాది మందికి సత్యం, అహింస మార్గాన్ని చూపిన గురువు. ఆయన సమాజంలో చీకటిని తొలగించి, ఆశాదీపాన్ని వెలిగించిన దివ్యమైన శక్తి.బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం వ్యక్తి కాదు—ఆయన ఒక ఉద్యమం, ఒక ఆదర్శం, భారతదేశ గుండెల్లో చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తి, ఇంతటి మహనీయుని జయంతికి యువకులు పెద్దలు మహిళలు విద్యావంతులు పాల్గొనాలని ఆయన ఆలోచనను ఆశయాలను మనమందరం ముందుకు తీసుకపోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బాపూరు జిలాల్ పూర్ బైరం కొండ బండ గొండ గ్రామ ప్రజలతోపాటు అంబేద్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ జిల్లా జాతర వర్కింగ్ ప్రెసిడెంట్ టి మాధవ్ జాతర జిల్లా కోశాధికారి చంటి జాతర జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నాగమ్మ జిల్లా ఉపాధ్యక్షురాలు అనిత తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments