
పైనుంచి సూర్యుడు ఏప్రిల్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో సర్కారు ఇక ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టనుంది. ఏప్రిల్‌లోనే ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ షురూ చేయాలని రేవంత్ రెడ్డి, సర్కారు భావిస్తోంది. విభాగాల వారీగా ఉద్యో గాల ఖాళీలను గుర్తించను న్నారు. తెలంగాణలో సుమారు ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకటించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయగా ఎస్సీ వర్గీకర ణకు అనుకూలంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ ముగిసే వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వబోమని చెప్పింది. ఈ కారణంగానే గత ఏడాది సెప్టెంబరు నుంచి నియామక ప్రకటనలు రాలేదు. ఇక ఈ నెల పద్నాలుగు తారీకు నుంచి వర్గీకరణ అమల్లోకి రావడంతో ఇప్పుడు సర్కారు మళ్లీ ఉద్యోగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియను షురూ చేయనుంది.
ఆర్టీసీ, వైద్య విభాగాల్లో పది వేల వరకు పోస్టులు ఉండే ఛాన్స్ ఉంది. మరోసారి గ్రూప్-ఒకటి ప్రకటన జారీ కోసం పోస్టులను అధికారులు గుర్తిస్తున్నారు. గ్రూప్ నాలుగు ఉద్యోగాలు, పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1,2,3,4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు రానున్నాయి.ఏ సమయంలో ఏయే పరీక్షలు నిర్వహించాలన్న దానిపై సర్కారు త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఏప్రిల్‌లోనే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, ఆరోగ్య శాఖలో నాలుగు వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని సర్కారు ప్రణాళిక వేసుకుంటోంది.