
సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నూగూరు,చర్ల మార్కెట్ వైస్ చైర్మన్ పూనెం రాంబాబు.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 15: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు, రైతులకు, యువతను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ యువ వికాస్ పథకం ప్రారంభించిందని, అయితే ఈయొక్క పథకంయొక్క కాల పరిమితి ఏప్రిల్ 14 తో ముగియడంతో చాలామంది యువత రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకోలేకపోయారని, కారణం సకాలానికి కులం,ఆదాయం ధృవపత్రాలు అందకపోవడవమే కారణమని తెలియజేశారు. ఈ యొక్క కారణాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 24 వరకు పొడిగించిందని, ఈయొక్క అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఒకప్రకటనలో నూగూరు, చర్ల వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ చైర్మన్ పూనెం రాంబాబు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకై అనునిత్యం ఆలోచించి, ప్రజల శ్రేయస్సుని కాంక్షించే ప్రజా నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలిపారు.