
పయనించే సూర్యుడు ///న్యూస్ ఏప్రిల్15//మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గోలపల్లి ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అంబేద్కర్ మాస్కులు ధరించి నివాళులర్పించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితంలో ఎదురైన అవమానాలను ఆయుధంగా మలుచుకొని భారత రాజ్యాంగాన్ని రచించి ఉన్నత స్థాయికి చేరిన ఆయన ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగలన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్ ఇందిరా లు పాల్గొన్నారు.
