
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ప్రకృతి వ్యవసాయం తోనే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్ శశిధర్ పేర్కొన్నారు ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ గ్రీవెన్స్ డే రోజు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు .ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రకృతి వ్యవసాయ కన్వర్జేన్స్ మీటింగ్ మండల కేంద్రమైన వెలుగు ఆఫీసులో జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెలుగు డిపార్ట్మెంటు రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి. శశిధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని గో ఆధారిత వ్యవసాయం చేయాలని ప్రకృతి వనమూలికల ద్వారా కషాయాలు తయారు చేసుకోని వ్యవసాయం కి ఉపయోగించాలని ఎన్ పి ఎం. షాపుల ను ఈవో ల ద్వారా నడిపించాలని కోరారు. ఏపీఎం .సృజన మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘ సభ్యులు కే ఏ పి-2025 లో భాగంగా కిచెన్ గార్డెన్స్ వేసుకోవాలని చెప్పారు ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ కె. సుబ్బయ్య మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా జరిగి కే ఏ పి-2025 లో భాగంగా పి ఎం డి ఎస్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదిక మీద ముందుకు సాగాలని తెలియజేశారు ఇందులో ఈవోలు, వి ఏ ఏ లు. సీసీ లు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు