Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Listen to this article

పయనం చేసి చూడు బాపట్ల ఏప్రిల్ 17:- రిపోర్టర్( కే. శివ కృష్ణ )

: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్ పై నిషేధం విధిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆదేశించింది. ఈ సంస్థ సూచన మేరకు అనుమతి లేని మెడిసిన్ రకాలపై నిషేధం విధిస్తూ డీసీజీఐ లేఖ ద్వారా హెచ్చరించింది. అందులో పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ డ్రగ్స్, నరాలకు సంబంధించిన డ్రగ్స్, గర్భధారణ మెడిసిన్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లాంటివి ఆ 35 రకాల మెడిసిన్లలో ఉన్నాయని సంస్థ తెలిపిందని సమాచారం. ఆ మెడిసిన్ ఉత్పత్తి తక్షణమే నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపరాదని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సరైన ప్రమాణాలు, సేఫ్టీ నిర్ధారణ లేని వాటిపై నిషేధం కొన్ని మెడిసిన్లలో ఒకటి కంటే ఎక్కువ డ్రగ్ కాంబినేషన్ (FDC) ఉంటుంది. అలా ఒకే మెడిసిన్ ఒకటి కంటే ఎక్కువ రకాల సప్లిమెంట్ కలిపే మందులను “కాక్టెయిల్” మెడిసిన్ అని పిలుస్తారు. CDSCO సంస్థ సూచనలతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆమోదించని FDCల తయారీతో పాటు మార్కెటింగ్ నిలిపివేయాలని లేఖ రాసింది. ప్రజల ఆరోగ్యం, మెడిసిన్ సమర్థతపై సమీక్షలు నిర్వహించి అధికారులు గతంలో లైసెన్స్ ఇచ్చిన 35 ఆమోదించని కొన్ని FDC ల జాబితాను సిద్ధం చేసి ఆ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శాస్త్రీయ నిర్ధారణ లేని మెడిసిన్ పేషెంట్ల ప్రాణాల మీదకు తెస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సంస్థ పేర్కొంది. మొదట సీడీఎస్‌సీఓ భద్రతా, సమర్థత సమీక్షలు జరపకుండా రాష్ట్రాలు కొన్ని కాంబినేషన్ మెడిసిన్లకు పర్మిషన్ ఇచ్చాయి. ఆపై అన్ని రకాల మెడిసిన్ ఉత్పత్తులపై పరీక్షలు నిర్వహించి వాటి సమర్థత పరీక్షించిన తరువాత వాటిని వినియోగించాలని DCGI చెబుతోంది. ఏప్రిల్ 11న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు డీసీజీఐ రాసిన లేఖను న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. ఆ లేఖ ప్రకారం.. DCGI కి చెందిన రాజీవ్ సింగ్ రఘువంశీ ‘ప్రజల ఆరోగ్యం, వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది’ అని హెచ్చరించారు. ఇది అత్యవసర, తీవ్రమైన అంశంగా పరిగణించాలని లేఖలో స్పష్టం చేశారు. లేఖలో ఏముంది.. ? కొన్ని రకాల FDC మందులు సరైన సేఫ్టీ, స్టాండర్డ్ కలిగి లేవని CDSCO గుర్తించింది. సరైన నిర్ధారణ పరీక్షలు జరపకుండానే అనుమతులు ఇచ్చినట్లు గుర్తించి మమ్మల్ని అలర్ట్ చేయగా చర్యలు ప్రారంభించాం. ‘డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టం 1940 కింద NDCT రూల్స్ 2019 నిబంధనల ప్రకారం ముందస్తుగా సేఫ్టీ, స్టాండర్డ్ అంచనా వేయకుండానే కొన్ని రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల తయారీ, పంపిణీ, విక్రయాలకు లైసెన్స్ పొందారని డీసీజీఐ దృష్టికి వచ్చింది. అలాంటి మెడిసిన్ వాడితే ప్రాణాంతకం కావొచ్చు. శాస్త్రీయ నిర్ధారణ లేని మెడిసిన్ వల్ల ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉండనున్నాయి. నియమాల ఉల్లంఘనకు దారితీయడానికి కారణం.. పలు రాష్ట్రాలు సరైన నియమ నిబంధనలు పాటించకుండా ఈ మెడిసిన్లకు అనుమతి ఇచ్చినందున గందరగోళానికి దారితీసింది. కొన్ని కంపెనీలు షాకోజ్ నోటీసులకు స్పందించి తమ ఉత్పత్తులను పరీక్షించాయి. ఈ లైసెన్సులను సంబంధిత డ్రగ్ లైసెన్సింగ్ అధికారులు మంజూరు చేశారని పేర్కొన్నాయి. దాంతో దేశవ్యాప్తంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద NDCT రూల్స్ 2019 నిబంధనను ఒకే విధంగా అమలు చేయడం లేదని గుర్తించామని’ DCGI అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత డ్రగ్ కంట్రోలర్లకు రాసిన లేఖలో పేర్కొంది. నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments