
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ ఆర్ సి..
కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద, యక్షగాన కళాకారుడు కర్రె నర్సయ్య గత తొమ్మిది రోజుల క్రితం మరణించాడు. అట్టి విషయాన్ని గమనించిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాతల సహాయం కోరగా స్పందించిన దాతలు 20000/-వేల రూపాయల వరకు ఫోన్ పే మరియు గూగుల్ పే ద్వారా ఆర్థిక సహకారం అందించినారు. 20,000/-వేల రూపాయలు మరియు అమ్మ ఫౌండేషన్ వారు 50 కిలోల బియ్యం మృతుడి కుటుంబానికి వారి కుమారులు కర్రె శ్రీనివాస్, కర్రె శ్రీకాంత్ లకు అందజేసి, ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ.. మేము ప్రింట్ & ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు సహాయం కోరినా స్పందించి ఆర్థిక సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఉపాధ్యక్షులు గోనెల పెద్దన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కొలిపాక రామస్వామి, సలహాదారుడు లోకిని శ్రీనివాస్ ,సభ్యులు కెమెరామెన్ గంథం సుమన్, దూలం సురేష్ గౌడ్ ,కర్రె సతీష్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.