
పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి తప్పలేదు. ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కేవలం ఒక వంద అరవై రెండు పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 18.1 ఓవర్లలో ముంబై సునాయసంగా ఈ లక్ష్యాన్ని ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ను ముంబై బౌలర్లు కట్టడి చేశారు. అతి కష్టం మీద సన్‌రైజర్స్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. చివరి ఓవర్లలో క్లాసెన్, కమిన్స్, అనికేత్ సిక్సర్లు కొట్టడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. ముంబై ఇండియన్స్‌కు వరుసగా ఇది రెండో విజయం కావడం విశేషం. హైదరాబాద్ కట్టడి ఈ మ్యాచులో టాస్ ఓడిన సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ తక్కువ పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లకు వీల్లేకుండా పోయింది. అయితే చివరి మూడు ఓవర్లలో నలబై ఎండు పరు గులు చేయడంతో జట్టు పోరాడే స్కోరందుకుంది.
తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు అభిషేక్, హెడ్ అవుట్ కావాల్సి ఉన్నా ఫీల్లర్డు క్యాచ్ పట్టలేకపోవడంతో బతికిపోయారు. ఐదో ఓవర్‌లో అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్ల కారణంగా పవర్‌ప్లేలో జట్టు నలబై ముడు పరుగులతో నిలిచింది. అయితే ఉన్న కాసేపు కాస్త వేగం చూపిన అభిషేక్ ఎనిమిద వ ఓవర్‌లో హార్దిక్‌కు చిక్కడంతో తొలి వికెట్‌కు అరవై పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ రెండు స్టంపవుట్ అయ్యాడు. హెడ్ ఇరవై ఎనిమిది వెనుదిరగడంతో రైజర్స్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. మధ్య ఓవర్లలో ముంబైదే పూర్తి హవా సాగింది. క్లాసె న్ కూడా ఇబ్బందిపడ్డాడు. అయితే చివర్లో క్లాసెన్ బ్యాట్ ఝుళిపించాడు. చివరి ఓవర్లో అనికేత్ 6,6, కమిన్స్ 6తో ఇరవై రెండు పరుగులు రావడంతో హైదరాబాద్ ఒక వంద అరవై రెండు పరుగులు చేసింది. ముంబై సునాయసంగానే.. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సునాయసంగానే గెలిచింది. రోహిత్ మూడు సిక్సర్లతో జోష్ నింపాడు. పవర్‌ప్లేలో ముంబై 55/1 స్కోరుతో పటిష్ఠంగా కనిపించింది. ఓపెనర్లు ఇద్దరూ అవుట య్యాక జాక్స్-సూర్య కుమార్ జోడీ రైజర్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. చెత్త బంతులను బౌండరీ లుగా మలుస్తూ ఒత్తిడి తగ్గించారు. అలాగే పదకొండు వ ఓవర్‌లో చెరో సిక్సర్ తో జట్టు స్కోరు వంద దాటింది. అయితే మూడో వికెట్‌కు యాబై రెండు పరుగులు జత చేరాక కమిన్స్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. కానీ హార్దిక్ ఇరవై ఒకటి తిలక్ ఇరవై ఒకటి నాటౌట్ బ్యాటింగ్తో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ముంబై గెలిచింది.