
జనరల్ డీఎస్సీ వద్దు=ఏజెన్సీ డిఎస్సీ ముద్దు
మా నిరుద్యోగుల భవిష్యత్ నాశనం చేయకండి
ప్రయాణించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్21
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసి నిరుద్యోగుల అత్యవసర సమావేశం కూనవరం మండలం,కోతులగుట్ట వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు పాల్గొని మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు బహిరంగ సభలలో ఆదివాసి ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటాము వారికి రావాల్సిన ప్రతి ఒక్కటి వారికి అందేలా చేస్తాము అలాగే రద్దు చేయబడిన జి.ఓ.యం.యస్:03 నీ మళ్ళీ పునరుద్ధరణ చేస్తానని ఆదివాసి ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు కాని ఇప్పుడు విడుదల చేసిన రాష్ట్ర వ్యాప్త డీఎస్సీ-2025 లో ఏజెన్సీ ప్రాంత పోస్టులును కూడా జనరల్ పోస్టులతో కలిపి ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతం అంత ఐదవ షెడ్యూల్ ప్రాంతం పరిధిలో ఉంటుందని ముఖ్యమంత్రి దగ్గర నుండి కింది స్థాయి అధికారుల వరకు అందరికీ తెలుసు జి.ఓ.యం.యస్:03 రద్దు చేయబడింది అనే ఒక కారణంతో ఏజెన్సీ ప్రాంత పోస్టులలో కూడా నాన్ ట్రైబల్ కి 94% శాతం అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అంటే ఆదివాసి సమాజం దిన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి ప్రశ్నించారు దీని వలన ఏజెన్సీ ఆదివాసి నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు,జి.ఓ.యం.యస్:03 విషయం గురించి సరైన ప్రకటన ఇవ్వలేదు??,జి.ఓ.యం.యస్:03స్తానంలో ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం తేవాలని ఆదివాసి ప్రజలు,ఆదివాసి సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వారు రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తి అరుస్తున్న అవేమి పట్టనట్టు మీ ప్రకటనలు మీరు చేస్తూ పోతున్నారు ఇంకా ఆదివాసి సమాజం మీద ఆదివాసి ప్రజల మీద ఎక్కడ మీకు ప్రేమ ఉంది ??,జి.ఓ.యం.యస్:03 మళ్ళీ పునరుద్ధరణ చేస్తానని మాట ఇచ్చి మాట మరిచారు ఇప్పుడు మా జాతి భవిష్యత్ మీద దెబ్బ కొడుతున్నారు, ఈ రోజు ఉద్యోగాలలో 94% శాతం రిజర్వేషన్ నాన్ ట్రైబల్స్ కి ఇస్తున్నారు, తర్వాత రాజకీయ 94% శాతం రిజర్వేషన్ ఇస్తారుఅనేది మా ఆదివాసి ప్రజలకు స్పష్టంగా అర్ధం అవుతుంది దిన్ని ఇప్పుడే ప్రతి ఒక్కరు వ్యతిరేకించకపోతే మన మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీ పోస్టులను ఏజెన్సీలో స్పెషల్ డి.ఎస్.సి ద్వారా మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఆదివాసి నిరుద్యోగులతో పాటు, ఆదివాసి ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ ఉమ్మడి ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో తెల్లం నాగేష్,కూరం. రాజు , కాక. సుబ్బారావు, ఎస్. బాపిరాజు, తాటి అఖిల్, కారం. రామకృష్ణ, రవ్వ. శశి ప్రకాశ్, ఎస్. జీవన్, వి. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు