
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలోనీ అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు చిన్న పిల్లలకు చిన్నపిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్ సుజాత ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు చిన్నారులకు అవసరమైన చిరుధాన్యాలు మరియు పౌష్టిక ఆహారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని గర్భిణులకు మరియు చిన్నపిల్లల తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. అనంతరం చిన్నారి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడియాల కుంట తండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శరత్ మరియు ఉపాధ్యాయులు సత్యం, భాస్కర్ ,సరిత అంగన్వాడీ టీచర్లు నిర్మల హేమలతా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
