
పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామంలో అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పటికీ అధిక మరణాలు కేవలం చిన్న కీటకం అయినా దోమ కాటు ద్వారానే జరుగుతున్నాయని ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువు దోమ అని మన ఇంటి పరిసరాలలో అనాఫిలిస్ క్యూలెక్స్ ఈడిస్ మాన్సోనియా అర్మిజరస్ రకం దోమలు పెరుగుతాయని ఇవి వ్యాధిగ్రస్తుడిని కుట్టి ఆరోగ్య వంతులను కుట్టడం ద్వారా వ్యాధులను చాలా సులభంగా అంటిస్తాయని దోమకాటు ద్వారా ప్రధానంగా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు బోదకాలు జికా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే బదులు వ్యాధులు వ్యాధులు వ్యాపించే విధానంపై అవగాహనె ముఖ్యం అని దోమలు పుట్టకుండా మరియు కుట్టకుండా ఉండడానికి ఇంటి పరిసరాలలో దోమలు పెరగడానికి అవకాశం ఉన్న నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రతి శుక్రవారం మరియు మంగళవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని దోమతెరలు వాడాలని గృహంలోకి దోమలు ప్రవేశించకుండా కిటికీలకు డోర్లకు జాలీలు అమర్చు కోవాలని నిండుగా బట్టలు ధరించాలని దోమ నిరోధక రసాయనాలు వంటివి వాడడం వల్ల దోమ కాటుకు దూరంగా ఉండవచ్చని ఈ సందర్భంగా వైద్యాధికారి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ ఆరోగ్య విస్తరణ అధికారి దేవా పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ సూపర్వైజర్లు కౌసల్య సింగ్ నాగుబండి వెంకటేశ్వర్లు పోరండ్ల శ్రీనివాస్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ధరణి శైలజ రుక్సానా ఇంద్రజ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు