
ఫోటో: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం.. రుద్రూర్, ఏప్రిల్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలో వ్యవసాయ కళాశాల (బి.ఎస్సి అగ్రికల్చర్), హాస్టల్, జూనియర్ కళాశాలలు మంజూరుకు కృషి చేయాలని రైడ్స్ (రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సోసైటీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన రైడ్స్ కమిటీ ఎమ్మెల్యేకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ లు పత్తి రాము, సంజీవరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు అక్కపల్లి నాగేందర్, రైడ్స్ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతీ శేఖర్, కోశాధికారి చిదుర మహిపాల్, సలహాదారులు బిజిగం వెంకటేశం, కేవీ మోహన్, ఉపాధ్యక్షులు నూతిపల్లి బాలరాజ్, ఈరపురం సాయిలు, శ్రీకాంత్, హుస్సేన్, పార్వతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.