
పయనించే సూర్యుడు ఏప్రిల్ 25(పొనకంటి ఉపేందర్ రావు ) శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఇల్లందు పోలీస్ స్టేషన్ ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. స్టేషన్ మొత్తం తనిఖీ చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇల్లందు డివిజన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలను పరిశీలించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు సూర్యం, శ్రీనివాని రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.