
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ సాయి తేజ రెడ్డి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఈ రోజు అస్పిరేషనల్ బ్లాక్ అయిన గుండాల మండలం కాచనపల్లి లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్థిక ప్రణాళిక, పొదుపు, వివిధ రకాల పెట్టుబడి సాధనాలు, బ్యాంక్ లావాదేవీలు, బ్యాంకింగ్ ఓంబుడ్స్ మెన్, ఆన్లైన్ మోసాల నుండి రక్షణ, స్వయం ఉపాధి పథకాల సద్వినియోగం తదితర అంశాలపై అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, ఎస్.బి. ఐ- కాచనపల్లి మేనేజర్ వేణు, ఎ.పి.ఏం. కోటేశ్వర రావు, సి.సి, మరియు సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్లు నాగేశ్వర రావు, జగ్య , మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.