
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
బిఆర్ఎస్అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి లో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో సభాస్థలికి విచ్చేశారు. హెలిక్యాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వరరావు,తో పాటు పలువురు ముఖ్య నేతలు కేసీఆర్ ను వేదిక వద్దకు ఆహ్వానించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా జమ్మూకశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అనం తరం ఆయన మాట్లాడు తూ.. కన్నతల్లి, జన్మభూమి ని మించిన స్వర్గం లేదని అన్నారు. వరంగల్ మామూలు నేల కాదు.. ఎంతోమంది వీరుల్ని కన్న గడ్డ అని చెప్పారు. ఇవాళ ఈ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవ డం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. ఆ నాడు గులాబీ జెండాను ఎంతో మంది అవమానించారని చెప్పారు. కానీ ఎనాడూ నిరాశ చెందలేదని.. నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించా మని అన్నారు. ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదని కార్యకర్తలను మాటిచ్చాను. జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా జెండా దించలేదని అన్నారు. చీకట్లను పారద్రోలి తెలంగాణలో వెలుగులు తీసుకొచ్చామని తెలిపారు. వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించామని తెలిపారు.
పోలీసులు ఇవ్వాళ డైరీలో రాసుకోవాలి పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడి యా యాక్టిలిస్టులను ఎందుకు అరెస్టుచేస్తు న్నారు. పోలీసులు ఇవ్వాళ ఇంటికి వెళ్లాక డైరీలో రాసుకోండి, మళ్లీ వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అది ఆపడం ఎవరి తరం కాదన్నారు కేసీఆర్.
ఇవాళ బిఆర్ఎస్ సభ పెట్టుకుంటే పోలీస్ లు అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన టిఆర్ఎస్ ప్రభంజనం ఎవరు ఆపలేరు అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై పోలీసులు కేసులు ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అయినా పోలీసులకు రాజకీయాలు ఎందుకు అని ఆయన అన్నారు. మా కార్యకర్తలపై కేసులు ఎందుకు పెడుతున్నారని ఆయన నిలదీశారు. కార్యకర్తలకు బి ఆర్ ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుం దన్నారు. ఇప్పటినుండి నేను బయటకు వస్తా ప్రజల తరఫున పోరాడుతాన న్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడ్డారని తెలిపారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణ సాధించుకొస్తామని బయల్దేరిన ఉద్యమకారు ల్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం పిట్టల్లా కాల్చేసిందని తెలిపారు. మళ్లీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ప్రజలంతా గమనించాలని సూచించారు.