Monday, April 28, 2025
Homeఆంధ్రప్రదేశ్కెసిఆర్ ప్రసంగంలో పస లేదు ::సీఎం రేవంత్ రెడ్డి!

కెసిఆర్ ప్రసంగంలో పస లేదు ::సీఎం రేవంత్ రెడ్డి!

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ స్పీచ్‌లో అసలు పసలేదని, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల ఉన్న కడుపుమంటే కనిపిస్తోందం టూ మండిపడ్డారు. అంతేకాకుండా కర్రెగుట్ట ఆపరేషన్ ఆపాలని, శాంతి చర్చలకు తాము సిద్ధ మంటూ మావోలు పంపిన లేఖపై కూడా స్పందించారు. ఈ శాంతి చర్చల విషయం పై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఇస్తామని, ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకో వాలో డిసైడ్ అవుతామని చెప్పారు. శాంతి చర్చల అంశం పై పార్టీ హైకమాండ్ కి కూడా సమాచారం ఇస్తాం. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. అధిష్టానం కి పీస్ కమిటీ రిక్వెస్ట్ నీ పంపిస్తాం. ఆ వ్యవహారం అంతా జానారెడ్డి.. కేకే చూస్తారు. కేసీఆర్ కి నేను సీఎం అయిన రెండో రోజే గుండె పగిలింది. ఇప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న అనర్ధాల కు కేసీఆర్ కారణం. ఖజానా అంతా లూటీ చేసింది ఆయన కాదా. కేసీఆర్ స్పీచ్ అంత అక్కసు తో మాట్లాడినట్టు ఉందన్నారు. కేసీఆర్ సభకు ఎన్ని అంటే అన్ని బస్సులు ఇచ్చాం. ఆర్‌టీసీకి ఆదాయం కూడా వచ్చింది. బస్సులు ఆపితే సభ ఆగిపోతుంది అని అనుకునేంత ఆలోచన వాళ్ళది’’ అని అన్నారు. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ కు వాళ్ళు కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు. నిన్న కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడు. కేటీఆర్, హరీష్ లను పిల్లగాల్లు అని కేసీఆర్ అన్నాడు … మరి ఆ పిల్లగాళ్ళను అసెంబ్లీ కి ఎందుకు పంపిస్తున్నాడు. కేసీఆర్ స్పీచ్ లో పస లేదు సంవత్సరన్నరగా పథకాలు తీసుకొచ్చాం…ఇప్పుడు వాటన్నిటిని స్ర్టీమ్ లైన్ చేస్తున్నాం. ప్రపంచంలో ఇంధిరా గాంధీ కి మించిన యోధురాలు లేదు. ఓక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే.. కేసీఆర్, మోడీ, వారీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు ,రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉంది… ఇది ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీం లు ఏ రాష్ట్రంలో అమలు లో లేవు.. చివరి 6 నెలలు వీటి పై చర్చ జరుగుతుంది. కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక.. ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం. పదేళ్లు మాక్కూడా అవకాశం ఇస్తారు ప్రజలు. పదేళ్లలో ఆయన చేసిన విధ్వంసం సెట్ చేయడానికే ఏడాది సరిపోయింది. కేటీఆర్..హరీష్ లు చిన్న పిల్లలు అసెంబ్లీకి వస్తు న్నారు అని నేను ముందే చెప్పాను.కేసీఆర్ కూడా నిన్న రజతోత్సవ సభలో అదే చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments