
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా లో తేదీ 29-04-2025 మంగళవారం రోజున ఉదయం 11:00 గంటలకు కె ఎన్ ఆర్ గార్డెన్ డిచ్పల్లీ నందు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం కలదు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఎం డి సి చైర్మన్ ఈరావత్రి అనిల్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నుడ చైర్మన్ కేశ వేణు,విత్నభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు,ఆర్మూర్ ఇంచార్జి వినయ్ రెడ్డి,బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి,బాన్సువాడ బాధ్యులు రవీందర్ రెడ్డి పాల్గొంటున్నారు. అదేవిధంగా జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ జిల్లా కో ఆర్డినేటర్లు బల్మోర్ వెంకట్, కోట్నాక తిరుపతి,సత్యనారాయణ పాల్గొంటున్నారు.