
కౌన్సెలింగ్ ద్వారా భర్తీ ఐ టి డి ఏ పి ఓ రాహుల్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్వరలో కౌన్సిలింగ్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులనుపాఠశాలలో, వసతి గృహాలలో భర్తీ చేయడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం నాడు పి ఎమ్ ఆర్ సి భవనంలోని సమావేశ మందిరంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా ఎంపిక కాబడిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులకు పరీక్షలు రాసి ఎంపిక కాబడిన అభ్యర్థులు గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని సెలెక్ట్ చేసి 27 మందిని భద్రాచలం జోన్ కు పంపించడం జరిగిందని, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ మరియు కమిటీ సభ్యుల సమక్షంలో అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎటువంటి పొరపాట్లు దొరలకుండా, చాలా పగడ్బందీగా పారదర్శకంగా జరిగిందని, వీరికి పాఠశాలలు తెరిచే లోపల ఖాళీ ఉన్నచోట్ల కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, సోషల్ వెల్ఫేర్ అధికారిని అనసూయ, బీసీ వెల్ఫేర్ అధికారిని ఇందిరా, ఏసీఎంవో రమణయ్య, ఏటీడీవోలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, డిడి ట్రైబల్ వెల్ఫేర్, పి ఎమ్ ఆర్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.