
పయనించే సూర్యుడు గాంధారి 29/04/25
గాంధారి మండల కేంద్రంలో సోమవారం రోజు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల ఏక రూప దుస్తులు కుట్టుటకు ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే కుట్టు మిషిన్ కార్మికులకు ఏక రూప దుస్తుల బట్టను స్థానిక ఎమ్మార్వో రేణుక చౌహన్ మరియు ఎంపీడీవో రాజేశ్వర్ అందజేశారు. ఈ కార్యక్రమం లో ఐకెపి ఎపిఎం గంగరాజు మరియు సీసీలు, కార్మికులు సీఆర్పీలు, వివిధ పాఠశాలల హెడ్మాస్టర్లు, పాల్గొన్నారు అని మండల విద్యాధికారి శ్రీహరి తెలిపారు.